Sudeep Kishan: థియేటర్లలో నవ్వులు చాలా గట్టిగా వినిపిస్తాయి 1 y ago
సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా డైరెక్టర్ త్రినాధ్ రావు తెరకెక్కిన చిత్రం 'మజాకా'. రావు రమేశ్, అన్షు ముఖ్యపాత్రలు పోషించారు. ఎ. కె. ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్లో కలిసి హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. “నా కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'మజాకా' నిలుస్తుంది. ఇంటిల్లిపాదీ కలిసి ఆస్వాదించే వినోదం ఉన్న చిత్రం. థియేటర్లలో నవ్వులు చాలా గట్టిగా వినిపిస్తాయి” అన్నారు సందీప్ కిషన్.